ఊర్వశివో రాక్షసివో-శిరీష్ కోసం బాలయ్య

balakrishna will be gracing for Urvasivo Rakshasivo Movie pre release event, Urvasivo Rakshasivo Movie pre release event, Urvasivo Rakshasivo pre release event, Nandamuri Balakrishna, Actor Nandamuri Balakrishna, Allu Sirish, Anu Emmanuel, Rakesh Sashi, Sirish Latest Movie, Sirish's Upcoming Movie, Urvasivo Rakshasivo, Urvasivo Rakshasivo Telugu movie, Urvasivo Rakshasivo New Update, Urvasivo Rakshasivo Telugu Movie New Update, Urvasivo Rakshasivo Movie, Urvasivo Rakshasivo Latest Update, Urvasivo Rakshasivo Movie Updates, Urvasivo Rakshasivo Telugu Movie Live Updates, Urvasivo Rakshasivo Telugu Movie Latest News, Urvasivo Rakshasivo Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. నిజానికి ఈసినిమాకు ముందు ఎందుకంటే ప్రేమంట అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అప్పట్లో ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ మధ్యలో ఈసినిమా నుండి అప్ డేట్స్ రావడం ఆగిపోయాయి. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే సడెన్ గా ఎందుకంటే ప్రేమంట అనే టైటిల్ ను ఊర్వశివో రాక్షసివో గా మార్చి రిలీజ్ కు సిద్దం చేశారు. ప్రస్తుతం అయితే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి కొద్ది రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 30వ తేదీన జేఆర్సీ కన్వెషన్ లో జరగనుంది. ఇక ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రానున్నారు.

కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మ‌ల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాబు, ధీర‌జ్ మోగిలినేని సహా నిర్మాతలు‌. ఇక ఈసినిమాను నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =