
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 44


స్క్రీన్స్ పెంచుకుంటున్న సర్దార్

చెన్నై లో విక్రమ్ మూవీ శతదినోత్సవ వేడుక

చిరంజీవి డ్యాన్స్ పై ఎన్టీఆర్ ప్రశంసలు

విజయ్-సమంత ఖుషి సినిమా కొత్త షెడ్యూల్ అప్ డేట్

తమిళ్ న్యూ ఇయర్ కు జైలర్ రిలీజ్ ప్లాన్

6రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సర్దార్

భారీ యాక్షన్ సీక్వెన్స్ లో వీర సింహారెడ్డి

సమంత యశోద ట్రైలర్ రిలీజ్

చెన్నైలో వారసుడు షూటింగ్.. ఆకట్టుకుంటున్న కొత్త స్టిల్స్

మాస్ లుక్ లో మేఘా ఆకాష్

ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ లో మార్పు లేదు -మేకర్స్

ప్రధాని మోదీ కై కాంతార మూవీ స్పెషల్ స్క్రీనింగ్

మరోసారి మాస్ అవతారంలో రానున్న సుధీర్ బాబు

విజయ్ తో సినిమా కన్ఫామ్ చేసిన లోకేష్ కనగరాజ్

మహేష్ బాబు ఫౌండేషన్ కొత్త కార్యక్రమం

మెగాస్టార్, మాస్ మహారాజా ల మాస్ సాంగ్
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు చిరు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. అందులో వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఒకటి. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇటీవల టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టైటిల్ టీజరే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఊరమాస్ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

స్క్రీన్స్ పెంచుకుంటున్న సర్దార్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో కార్తీ. తన సినిమాలతో కేవలం తమిళ్ అభిమానులనే కాదు తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. అందుకే కార్తి సినిమాలను కూడా తెలుగు అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. ఇక రీసెంట్ గా వచ్చిన సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఈసినిమా నీటి విలువని తెలియజేశారు మేకర్స్. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

రామ్ సేతు మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సత్యదేవ్
బ్లఫ్ మాస్టర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన సత్యదేవ్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా సత్యదేవ్ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు . ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ ప్రతి నాయకుడిగా అద్భుతంగానటించి మెప్పించారు. రీసెంట్‌గా విడుదలైన చిత్రం రామ్ సేతుమూవీ తోసత్యదేవ్ బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు.

చెన్నై లో విక్రమ్ మూవీ శతదినోత్సవ వేడుక
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ ఖైదీ మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విక్రమ్ జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విక్రమ్ మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే.

చిరంజీవి డ్యాన్స్ పై ఎన్టీఆర్ ప్రశంసలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

విజయ్-సమంత ఖుషి సినిమా కొత్త షెడ్యూల్ అప్ డేట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మహానటి తర్వాత విజయ్‌దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అతిథిగా న్యాచురల్ స్టార్ నాని
టాలీవుడ్ కుర్ర హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ హీరో ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా కూడా ఒకటి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ…

తమిళ్ న్యూ ఇయర్ కు జైలర్ రిలీజ్ ప్లాన్
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఇక ఏడాది మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

6రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సర్దార్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తి హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇచ్చారు.

భారీ యాక్షన్ సీక్వెన్స్ లో వీర సింహారెడ్డి
టాలీవుడ్ అగ్రహీరో నటసింహం బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు అదే జోష్ తో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా ఈసినిమా రూపొందుతుంది. ఇంతవరకూ ఈసినిమా ఎన్బీకే 107 టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుపుకుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ కే సూపర్ రెస్పాన్స్…

సమంత యశోద ట్రైలర్ రిలీజ్
ఈమధ్యకాలంలో సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఈనేపథ్యంలోనే తెలుగులో వస్తున్న సినిమాలు శాకుంతలం, యశోద సినిమాలు. శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు యశోద సినిమా మాత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నవంబర్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

చెన్నైలో వారసుడు షూటింగ్.. ఆకట్టుకుంటున్న కొత్త స్టిల్స్
దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు…

మాస్ లుక్ లో మేఘా ఆకాష్
లై మూవీ తో టాలీవూడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తలైవా రజనీకాంత్ సూపర్ హిట్ పెట్ట మూవీ తో మేఘ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. 3 తమిళ , రెండు హిందీ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘ సూపర్ హిట్ రాజ రాజా చోర మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. మేఘ ప్రస్తుతం 5 తెలుగు , 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

రంగమార్తాండ మూవీ కి డబ్బింగ్ చెబుతున్న బ్రహ్మానందం
హౌస్ ఫుల్ మూవీస్ , రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ మరాఠి మూవీ నటసామ్రాట్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రంగమార్తాండ మూవీ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ మూవీ లో ఆదర్శ్ బాలకృష్ణ , అనసూయ , శివాత్మిక రాజ శేఖర్ , రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయ రాజా సంగీతం అందించారు.

ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ లో మార్పు లేదు -మేకర్స్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు .హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ పాన్…

ప్రధాని మోదీ కై కాంతార మూవీ స్పెషల్ స్క్రీనింగ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 188 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ ఇతర భాషలన్నింటిలోనూ 60 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మరోసారి మాస్ అవతారంలో రానున్న సుధీర్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు మాత్రం ఒక సినిమా తరువాత మరొక సినిమాను లైన్ లో పెట్టుకుంటూ వెళుతున్నాడు. ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అయితే మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా హంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఈసినిమా అప్ డేట్స్ ను ఇస్తూ వస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్…

విజయ్ తో సినిమా కన్ఫామ్ చేసిన లోకేష్ కనగరాజ్
తమిళ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ ఒకరు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గానే లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కమల్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ తన తరువాత సినిమాను విజయ్ తో చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటివరకూ దీనిపై కన్ఫర్మేషన్ రాలేదు.

మహేష్ బాబు ఫౌండేషన్ కొత్త కార్యక్రమం
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 మూవీలో నటిస్తున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగా మహేష్ బాబు తన సంపాదనలో కొంతభాగాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉంది - జాన్వీ కపూర్
సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కథానాయికగా తెరకెక్కిన మిలి మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.