ఆర్ఆర్ఆర్ ఖాతాలో ఇంటర్నేషనల్ అవార్డ్

rrr wins best international film award, SS Rajamouli Shares A Special Message, RRR Wins The Best International Film, The Best International Film At These Awards, Saturn Awards, Saturn Awards The Best International Film, RRR, RRR Movie Updates, RRR Telugu Movie Latest News, Ajay Devgn, Alia Bhatt, NT Rama Rao Jr, Olivia Morris, Ram charan, RRR (2022), RRR Latest Update, RRR Movie, RRR Movie Latest News And Updates,RRR New Update, RRR Telugu Movie, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie New Update,SS Rajamouli, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తన సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియచేశాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా ఎంత సంచలన విజయం సాధించిందో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఈసినిమా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంది. రీసెంట్ గానే ఈసినిమా గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గా ప్రదర్శనకు గాను ఎంపికైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సైన్స్ ఫిక్షన్, హార్రర్ మరియు ఫాంటసీ చిత్రాలను గౌరవించే సాటర్న్ అమెరికన్ అవార్డుల నామినేషన్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఎంపికైన సంగతి తెలిసిందే కదా. మూడు కేటగిరీల్లో ఈసినిమాను ఎంపిక చేయడం జరిగింది. బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్షన్-అడ్వెంచరస్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీల్లో ఈసినిమా నామినేట్ అయింది. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. దీంతో చిత్రయూనిట్ సంతోషంలో ఉంది. మరోవైపు రాజమౌళి జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా.. వీడియో కాల్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ”మా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం తరపున శాటన్ అవార్డుల జ్యూరీకి థాంక్స్. మా సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు రెండో శాటన్ అవార్డు. ఇంతకు ముందు ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాకు అవార్డు అందుకున్నాను. ఇతర పురస్కార విజేతలకు నా అభినందనలు” అని రాజమౌళి పేర్కొన్నారు.

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nine =