విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారసుడు. తమిళ్ లో ఈసినిమా వారిసు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఫ్యామిలీ అండ్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈమధ్య ఈసినిమాపై పలు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కేవలం తమిళ్ లోనే తెరకెక్కుతుందని.. తెలుగులో డబ్బింగ్ లోనే వస్తుందన్న వార్తలు మొదలయ్యాయి. నిజానికి ఈసినిమా మొదలైనప్పుడు కూడా అందరూ డైరెక్ట్ తెలుగు సినిమా అనే అనుకున్నారు. అటు తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా రెండూ భాషల్లోనూ ఈసినిమా తెరకెక్కుతుందనే అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు వంశీ మరింత క్లారిటీ ఇచ్చినట్టైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీని ఈసినిమా గురించి అడుగగా.. ఈసినిమా తమిళ్ లోనే తెరకెక్కుతుందని కన్ఫామ్ చేశాడు. అంటే దీన్నిబట్టి తెలుగులో ఈసినిమా డబ్బింగ్ వర్షన్ ను మాత్రమే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























