తెలుగు ప్రేక్షకులకు తమిళ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యుగానికి ఒక్కడు సినిమాతోనే తనలో మంచి నటుడిని పరిచయం చేశాడు. ఇక ఆతరువాత ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అయితే వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తీకి రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. మొదటి భాగంలో సస్పెన్స్ అంశాలతో నీటి విలువని తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లను రాబడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందన్న వార్తలు రీసెంట్ గా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తాజాగా సర్దార్ 2 ను ప్రకటించారు మేకర్స్. ఈనేపథ్యంలో ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఓ అధికారి కార్తీని పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి తొలగిస్తున్నట్లు చెబుతారు. కానీ సీక్రెట్ ఏజెంట్ గా ఉండాలని చెప్పడంతో కార్తీ యస్ సర్ అని అంటాడు. ఒకసారి స్పై అయితే, ఎప్పుడూ స్పై.. మిషన్ కంబోడియా త్వరలో మొదలవుతుంది.. అంటూ ఉంది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022
కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో రజీషా విజయన్, లైలా, యోగి సేతు, మునీష్కాంత్, మాస్టర్ రిత్విక్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: