
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 46


కమల్-కార్తి క్రేజీ కాంబోలో సినిమా?

కన్నడ చిత్ర పరిశ్రమలో కాంతార మూవీ రికార్డ్

నిఖిల్ 18 పేజెస్ మూవీ న్యూ రిలీజ్ డేట్

డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ రిలీజ్

దీపావళి కి వారసుడు మూవీ రిలీజ్ అప్ డేట్

రావణాసుర మూవీ రిలీజ్ డేట్

డ్రైవర్ జమున కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

యశోద ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్పామ్ సంక్రాంతి బరిలో ఏజెంట్

సర్దార్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది

రిలీజ్ అయిన #MEGA154 మూవీ టైటిల్ టీజర్

హిట్ 2 పై నాని టీజర్ అప్ డేట్

షిర్లే సెటియా స్మైలింగ్ ఫొటో

ఆల్ టైమ్ 10 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్

#NC22 మూవీ మైసూరు షెడ్యూల్ పూర్తి

జపనీస్ భాషలో మాట్లాడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

విక్రమ్ 61 ట్రైటిల్ రిలీజ్
విభిన్నమైన కథలు ఎంచుకోవడంలో, డిఫరెంట్ పాత్రలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే విక్రమ్ సినిమా అంటే కేవలం అతని అభిమానులకు మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక ఈఏడాది కోబ్రా, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు విక్రమ్. అయితే వీటిలో కోబ్రా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా పొన్నియన్ సెల్వన్ మాత్రం తమిళ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే 450 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు విక్రమ్ తన తరువాత ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ కెరీర్…

కమల్-కార్తి క్రేజీ కాంబోలో సినిమా?
తమిళ్ స్టార్ హీరో కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విరుమన్, పొన్నియన్ సెల్వన్ రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో మంచి టాక్ ని సొతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం లోక నాయకుడు కమల్ హాసన్ ఇంకా కార్తి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.

కన్నడ చిత్ర పరిశ్రమలో కాంతార మూవీ రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ ఇతర భాషలన్నింటిలోనూ 60 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

నిఖిల్ 18 పేజెస్ మూవీ న్యూ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కార్తికేయ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

దీపావళి పండగ సందర్భంగా న్యూ మూవీస్ పోస్టర్స్ రిలీజ్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన యశోద మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ రిలీజ్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద సినిమాలుగా హిట్ అయినవి చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకి, యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా అందించింది.

దీపావళి కి వారసుడు మూవీ రిలీజ్ అప్ డేట్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది.

రావణాసుర మూవీ రిలీజ్ డేట్
యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు , సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

సితార డ్యాన్స్ వీడియో తో మహేష్ బాబు దీపావళి శుభాకాంక్షలు
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ మహేష్ బాబు అభిమానులను అలరిస్తున్నారు.

డ్రైవర్ జమున కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కౌసల్యాకృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఆతరువాత పలు సినిమాలు చేసింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తుంది. పా. కిన్స్లిన్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డ్రైవర్ జమున. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను కూడా రిలీజ్ చేశారు కూడా. ఇవి సినిమాపై భారీ అంచనాలనే పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు…

యశోద ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత దశాబ్దానికి పైగానే ఇండస్ట్రీని ఏలింది. చివరిగా తెలుగులో సమంత ‘జాను’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత రెండేండ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. అందులో యశోద సినిమా కూడా ఒకటి. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా యశోద. సమంత అభిమానులు చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ బర్త్ డే కు ఆదిపురుష్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

కన్పామ్ సంక్రాంతి బరిలో ఏజెంట్
సంక్రాంతి వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత రెండేళ్లలో కరోనా ప్రభావం వల్ల ఆ సందడి కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయినా కూడా ప్రేక్షకులను ఎలాగైనా అలరించాలని కొంతమంది మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఈ ఏడాది కాస్త ఎక్కువ సినిమాలో సంక్రాంతికి సందడి చేశాయి. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఇప్పటినుండే చాలా సినిమాలు లైన్ కడుతున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ లాంటి భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. దీనితో పాటు పలు సినిమాలు కూడా అప్పుడే సీటు రిజర్వేషన్ చేసుకుంటున్నాయి. తాజాగా మరో సినిమా ఆ లిస్ట్ లో చేరింది. ఆ సినిమా మరేదో కాదు…

సర్దార్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు కార్తి. అందుకే వరుస హిట్లను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే విరుమన్ సినిమాతో హిట్ ను అందుకున్న కార్తి ఇప్పుడు సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మిత్రన్ దర్శకత్వంలో కార్తి హీరోగా ఈసినిమా వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మొదటి షో నుండి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

రిలీజ్ అయిన #MEGA154 మూవీ టైటిల్ టీజర్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా #MEGA154 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.#MEGA154 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హిట్ 2 పై నాని టీజర్ అప్ డేట్
న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తన సినిమాలతో, తన నటనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటన అత్యంత సహజంగా ఉంటుంది కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే నాని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక నాని ఒకవైపు నటిస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. నాని సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా హిట్.

షిర్లే సెటియా స్మైలింగ్ ఫొటో
న్యూజిల్యాండ్ సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లే సెటియా మస్కా (2020 ) మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. నికమ్మ (2022 )హిందీ మూవీ లో నటించారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన హిట్ మూవీ కృష్ణ వ్రింద విహారి తో షిర్లే టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో షిర్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య , షిర్లే ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. కృష్ణ వ్రింద విహారి మూవీ లో షిర్లే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొనడం విశేషం.

ఆల్ టైమ్ 10 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్
FIPRESCI - INDIA (ఇండియా చాప్టర్ ఆఫ్ ది ఇంటర్ నేషనల్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ) ఆల్ టైమ్ 10 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ పై పోల్ ను నిర్వహించింది. ఎక్కువ ఓట్లు పోల్ అయిన మూవీస్ లిస్ట్ ను FIPRESCI - INDIA ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసింది. వీటిలో హిందీ , బెంగాలీ , కన్నడ , మలయాళ భాషల మూవీస్ ఉన్నాయి.

#NC22 మూవీ మైసూరు షెడ్యూల్ పూర్తి
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #NC22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

జపనీస్ భాషలో మాట్లాడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.