వాల్తేరు వీరయ్య కు సూపర్ రెస్పాన్స్

waltair veerayyas title teaser gets super response, Mega 154's title teaser gets super response, waltair veerayyas title, Mega 154's title teaser, Megastar Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, KS Ravindra, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Waltair Veerayya, Waltair Veerayya Telugu movie, Waltair Veerayya New Update, Waltair Veerayya Telugu Movie New Update, Waltair Veerayya Movie, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu Movie Live Updates, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు మెగా 154 టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా టైటిల్ గురించి ఎప్పటినుండో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే మొదటి నుండీ వాల్తేరు వీరయ్య అనే టైటిలే తెరపైకి వచ్చింది. ఆ తరువాత చిరుతో పాటు పలువురు కూడా ఇదే టైటిల్ ను చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అందరూ చెప్పినట్టే ఈసినిమా టైటిల్ ను వాల్తేరు వీరయ్య గా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు.

టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు టైటిల్ టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఎక్కడ్రా మీ అన్నయ్య వస్తే ఏదో అయిపోతుందని అన్నారు ఎక్కడ్రా అని విలన్ అంటుంటాడు. వెంటనే బాంబులో హార్బర్ మోతక్కుతుంది. ఆ సమయంలో స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకుని బీడి తాగుతున్న చిరంజీవి .. వాల్తేరు వీరయ్యగా కనిపించారు. ఇంకా ఇలాంటి ఎంటర్‌టైన్‌‌మెంట్ కావాలంటే లైక్, షేర్, సబ్ స్క్రైబ్ చేయడంటూ చివరలో చిరంజీవి చెప్పిన డైలాగ్ హైలెట్ గా ఉంది. ఇక ఈ టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకూ ఈసినిమా 8 మినియన్ వ్యూస్ తో పాటు 2లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =