టాలీవుడ్ లో విభిన్నమైన కథలు తీయడంలో యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్నారు. అందులో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో కొత్త జోనర్ లో సినిమాతో రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఈసినిమా టీజర్ ను త్వరలో రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈసినిమా టీజర్ గురించి హింట్ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇచ్చారు. మరి దీన్నిబట్టి త్వరలోనే టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది.
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: