ది ఇంటర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా( IFFI) లో ఆర్ ఆర్ ఆర్ , అఖండ

Akhanda And RRR Movies selected for screening in 53rd International Film Festival

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ 75 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది. బాలకృష్ణ సినీ కెరీర్ లో “అఖండ“మూవీ అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీ గా నిలిచింది.

53వ ( IFFI) ది ఇంటర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలు గోవా లో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. 12 మంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగీరీలో అద్భుత ప్రేక్షకాదరణ పొందిన బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ , అఖండ మూవీస్ ఎంపిక అయ్యాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + thirteen =