‘అఖండ’ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోలేదు…!

Producer Miryala Ravinder Reddy Opens Up About Akhanda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Akhanda,Akhanda latest Movie,Akhanda Blockbuster Movie,Akhanda Latest Telugu Movie,Akhanda Super Hit Movie,Akhanda Latest Tollywood Movie, Producer Miryala Ravinder Reddy,Akdhanda Producer Miryala Ravinder Reddy,Producer Miryala Ravinder Reddy Movies,Producer Miryala Ravinder Reddy Latest Blockbuster Movies, Producer Miryala Ravinder Reddy Latest Blockbuster Movie Akhanda,Producer Miryala Ravinder Reddy opens About Akhanda Movie,Miryala Ravinder Reddy Opens On Akhanda Movie, Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Nandamuri Balakrishna Blockbuster Movie Akhanda,Pan India Movie Akhanda,Balayya AKhanda Movie, Ahanda Movie Collections,Balayya AKhanda Movie Box Office Collections,Balayya AKhanda Movie All time Box Office Collections #Akhanda

ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో వారం రోజులు ఆడటమే ఎక్కువ అయిపోయింది. సూపర్ హిట్ సినిమాలే రెండు మూడు వారాల్లో వెళ్లిపోతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక సినిమా 50 రోజులు ఆడటం అంటే మాములు విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఘనతను నందమూరి బాలకృష్ణ సాధించారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ’మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూశాం. ఈసినిమాతో ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హైద్రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్‌లో 50రోజుల వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మా చిత్రయూనిట్ అంతా ప్రేక్షకులకు కృతజ్ఞులమయ్యాం.. వారే ఈసినిమాను పెద్ద సక్సెస్ చేశారు.. నిజానికి ఈసినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు. ప్రజలు తమ డ్రీమ్ నెరవేరినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో ఇప్పుడు నేను కూడా అలాంటి ఆనందంలోనే ఉన్నాను.. ఇక ముందు కూడా ప్రేక్షకుల ఆదరణ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =