మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యామీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యామీనన్ ప్రస్తుతం “భీమ్లా నాయక్ “మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్నారు. ఒక తమిళ , ఒక మలయాళ మూవీ లో నిత్య నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తనకు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ దివంగత మీనాకుమారి లేదా మధుబాల బయోపిక్ మూవీ లో నటించాలని ఉందని నిత్యామీనన్ తన మనసులో మాటను వెల్లడించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























