టాలీవుడ్ లో రోజు రోజుకు కొత్త టాలెంట్ పెరిగిపోతుంది. ఎంతో మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. కానీ ఎంత మంది వచ్చినా కూడా కొంతమంది మార్క్ మాత్రం గుర్తుండిపోతుంది. అలా వచ్చి ఇప్పుడు నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోనే విజయ్ దేవరకొండ. ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రౌడీ హీరో. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరగగా.. ఆ తరువాత కూడా వరుసగా హిట్స్ కొట్టడంతో స్టార్ రేంజ్ కు ఎదగడమే కాదు.. తన రేంజ్ ను మార్చేశాడు. ఇక స్టార్ డైరెక్టర్స్ సైతం తనతో సినిమా తీయాలన్న ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగలిగాడు. ప్రస్తుతం అయితే పూరీ డైరెక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అయితే గత కొద్ది రోజులుగా ఈసినిమాపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలు కాస్త శివ నిర్వాణ దగ్గరకు వెళడంతో క్లారిటీ ఇచ్చాడు. తన ట్విట్టర్ ద్వారా ఈ వార్తలు అన్నీ అబద్దం అంటూ స్పష్టం చేశాడు. మరి ఇప్పటికైనా ఈన్యూస్ కు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..
False news https://t.co/c2BLhLeJMn
— Shiva Nirvana (@ShivaNirvana) January 20, 2022
కాాగా ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే శివ నిర్వాణ తన మార్క్ ను చూపించగలిగాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. రీసెంట్ గానే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: