ఏపీ ముఖ్య మంత్రి జగన్కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత నవంబర్ నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కైకాల సత్యనారాయణ. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అయితే కైకాల సత్యనారాయణ కోలుకున్నారు. ఈనేపథ్యంలో ఆయన జగన్ కు లేఖ రాశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తను రాసిన లేఖలో.. తన అనారోగ్య సమయంలో సాయం అందించి ప్రత్యేక శ్రద్ద చూపించడం సంతోషమేసిందని చెప్పారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం.. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇవ్వడం, మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా సాయం అందించడం ఆనందంగా ఉందని కైకాల చెప్పారు. కష్ట సమయంలో మీరు అందించిన సహాయం తనకు, తన కుటుంబానికి ఎంతో శక్తినిచ్చిందని కైకాల తన లేఖలో పేర్కొన్నారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు.
కాగా సినిమా టికెట్ల్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ మధ్య గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. కొంతకాలంగా సాగుతున్న ఈ వివాదంపై ఎన్నో చర్చలు జరిగాయి కూడా. ఇప్పటికే పలువురు నిర్మాతలు, హీరోలు కూడా కలిశారు. రీసెంట్ గానే మెగాస్టార్ చిరు కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఈనేపథ్యంలో జగన్ కూడా సానుకూలంగా స్పందించారని.. తమ సమస్యలను వివరించామని.. జగన్ తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని చెప్పడం జరిగింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: