కరోనా థర్డ్ వేవ్ ప్రభావం రోజు రోజుకు ఎంత విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళం నుండి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. అంతేకాదు రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నాం అని తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ఈరోజు మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తనకు కూడా కరోనా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియచేశాడు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు తరుణ్ భాస్కర్. హలో ఫ్రెండ్స్ నాకు కోవిడ్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. కోవిడ్ ని సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అని అంటూ పోస్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా ఒక మాదిరిగానే ఆడింది. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కూడా తీసాడు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తన మూడో సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఆమధ్య వెంకీతో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన కథను కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: