తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నాంది సినిమా లో కూడా లాయర్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో బిజీ బిజీ అవుతుంది. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతుంది. పెద్ద పెద్ద సినిమాలో కీలక పాత్రలను సైతం దక్కించుకుంటుంది. మేకర్స్ కూాడా వరలక్ష్మీ కి మంచి పాత్రలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖండలో అఘోర పాత్రలో విశ్వరూపం చూపించగా.. గోపీచంద్ మలినేని తన సినిమాలో బాలయ్య ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించనున్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
సమంత ప్రధాన పాత్రలో యశోద అనే సినిమా వస్తుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది.
సందీప్ కిషన్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకోగా.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈసినిమాలో ఒక కీలక పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
మొత్తానికి హీరోయిన్ గా కాకపోయినా కూడా నెగిటివ్ రోల్స్ తో మాత్రం వరలక్ష్మీ శరత్ కుమార్ మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. ఈసినిమాలతో పాటు అటు తమిళ్ లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కు మంచి అవకాశాలే వస్తున్నట్టు తెలుస్తుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: