టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ హీరో ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకోగా.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు . అంతేకాదు స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా తాజాగా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు మేకర్స్. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు.
కాగా ఈసినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను రంజిత్ జయకోడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: