కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ కుమార్ ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అజిత్ హీరోగా తెరకెక్కిన “వాలిమై“మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మాతగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#AK61” మూవీ కి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “నెర్కొండ పార్వై”, “వాలిమై” మూవీస్ తరువాత వీరి ముగ్గురి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజిత్ కుమార్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. తన సినిమాల షూటింగ్స్ దాదాపుగా ఇక్కడే జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతైనా సొంతూరు కదా.. అందుకే జంట నగరాల మీద అగ్ర కథానాయకుడికి అంత అఫెక్షన్ . అజిత్ కు హైదరాబాద్ లో కూడా ఆస్తులు ఉన్నాయి . అజిత్ లేటెస్ట్ మూవీ “వాలిమై’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే జరిగిన విషయం తెలిసిందే. తదుపరి మూవీ “#AK61” మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టు ,కరోనా పరిస్థితులు అనుకూలిస్తే మార్చి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళతారనీ సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: