మీరే నిజమైన రాజు..!

Actor Navdeep Hails Superstar Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Actor Navdeep,Navdeep,Navdeep Latest News,Navdeep News,Navdeep Updates,Navdeep Latest Updates,Mahesh Babu Saved 1058 Lives,Navdeep Movies,Navdeep Upcoming Movies,Navdeep New Post,Navdeep Latest Post,Navdeep On Social Media,Navdeep About Mahesh Babu,Actor Navdeep About Mahesh Babu,Navdeep About Super Star Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest News,Mahesh Babu News,Mahesh Babu Helping,1058 Hearts Saved,Navdeep On Twitter,Super Star Mahesh Babu Saved Another Baby,Mahesh Babu And Namrata Save Another Life,Namrata,Navdeep Hails Superstar Mahesh Babu,1058 Hearts Saved By Mahesh Babu,1058 Hearts Saved By Superstar Mahesh Babu,Superstar Mahesh Babu Saved 1058 Children Hearts,Mahesh Babu Saved 1058 Children Hearts,MB For Saving Hearts Latest News,MB For Saving Hearts,Superstar With Golden Heart,Mahesh Babu Lends His Support For 1058 Heart Surgeries,Mahesh Babu Saves Another Child,Superstar Mahesh Babu Saves Another Child,Mahesh Babu Trending For Saving 1058 Hearts,Navdeep Praises For Mahesh Babu,Navdeep Compares Mahesh Babu To A King,Superstar Mahesh Babu Saved 1058 Lives,Mahesh Babu Saved Another Baby’s Life,Mahesh Babu Kind Heart,Mahesh Babu Help,#MaheshBabu,#Navdeep

కొంత మంది తెలిసేలా సేవా కార్యక్రమాలు చేస్తే.. కొంత మంది తెలియకుండా సేవా కార్యక్రమాలు చేసే వాళ్లు ఉంటారు. అలా బయటకు చెప్పుకోకుండా సేవ చేసే.. సాయం అందించే సినీ సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఎవరో ఒకరి ద్వారానో లేక సాయం పొందిన వారు చెబితే తప్పా బయటకు రాని ఘటనలు చాలానే ఉంటాయి. ఇక అలా సాయం చేసినా బయటకు చెప్పుకోని వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఇప్పటికే మహేష్ బాబు చిన్న పిల్లలకు పలు సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు.. పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే వెయ్యిమందికి పైగా చిన్నారుల గుండె ఆపరేషన్స్ కు మహేష్ సాయం అందించిన సంగతి తెలిసిందే కదా. ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో ఎంతో మంది చిన్నారుల గుండె ఆపరేషన్స్ ను చేయిస్తున్నారు మహేష్. ఇక తాజాాగా మరో చిన్నారి గుండెను కాపాడారు మహేష్. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు తమ సోషల్ మీడియా వేదిక ద్వారా ఆ విషయాన్ని పంచుకుంటున్నారు. దీంతో హీరో నవదీప్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మహేష్ పై ప్రశంసలు కురిపించారు. 1058 గుండెలను కాపాడారు.. మీరు నిజమైన ప్రిన్స్.. చెప్పాలంటే అసలైన రాజు మీరే అని ట్వీట్ లో ప్రశంసించారు. మరి చిన్న సాయం చేస్తేనే చెప్పుకునే ఈ రోజుల్లో మహేష్ ఇన్ని గుండెలను కాపాడడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈసినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =