2001 సంవత్సరంలో “సూత్రధారణ్ “, “రన్” మూవీస్ తో మీరా జాస్మిన్ మలయాళ , తమిళ చిత్ర పరిశ్రమలకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. పలు మలయాళ , తమిళ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీరా 2004 సంవత్సరం లో “అమ్మాయి బాగుంది “మూవీతో టాలీవుడ్ , “మౌర్య “మూవీ తో శాండల్ వుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. “గుడుంబా శంకర్”, “భద్ర” , “పందెం కోడి”, ” గోరింటాకు” వంటి మూవీస్ తో మీరా ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్‌ని 2014లో మీరా పెళ్లిచేసుకున్నారు.అయితే మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయిన మీరా జాస్మిన్ మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ కి సిద్ధం అయ్యారు. ఇప్పటికే “మకల్” అనే ఓ మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న మీరా ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టిన మీరా కు ఒక్క రోజులోనే సుమారు లక్షమంది ఫాలోవర్స్ ఏర్పడడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: