ప్రభాస్ వారియర్ అలానే రాజమౌళి క్రియేటర్ అని అంటున్నారు కింగ్ నాగార్జున. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున-నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా బంగార్రాజు. ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాగా.. పలు సినిమాలు సంక్రాంతికి బక్సాఫీస్ వద్ద బరిలో దిగినా కూడా వాటన్నింటికీ పోటీ ఇస్తూ ఈ సినిమా పొంగల్ విన్నర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున పలు హీరోల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ వారియర్ అని రాజమౌళి క్రియేటర్ అని అలానే అమితాబ్ బచ్చన్ ఐకాన్ ఆఫ్ ఇండియా అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ రాగా రీసెంట్ గానే మళ్లీ రీస్టార్ట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి – నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్ – పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈసినిమా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉండగా బ్రహ్మాస్త్ర సినిమా సౌత్ బాధ్యతలు రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే కదా.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: