“అలై పాయుదే “మూవీ తో కోలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మాధవన్ పలు సూపర్ హిట్ తమిళ , హిందీ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమిళ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొన్ని ఇంగ్లీష్ , కన్నడ , మలయాళ మూవీస్ లో నటించిన మాధవన్ 3 హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక బయోగ్రాఫికల్ మూవీ తో మాధవన్ దర్శకుడిగా మారుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రికలర్ ఫిలిమ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్ బ్యానర్స్ పై స్వీయ దర్శకత్వంలో మాధవన్, సిమ్రాన్ జంటగా ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఇంగ్లీష్ , హిందీ , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “రాకెట్రీ :ది నంబి ఎఫెక్ట్ “జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానున్నాయి. హీరో మాధవన్ ఒక నిర్మాతగా ఉన్న “రాకెట్రీ :ది నంబి ఎఫెక్ట్ ” మూవీ కి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ మాధవన్ డైరెక్టర్ గా ఫస్ట్ టైమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: