“నన్హా షికారి “(1973 ) మూవీ తో బాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన బప్పి లహరి , “సురక్ష ” (1979 ) మూవీ తో సింగర్ గా మారారు. హిందీ, బెంగాలీ , తెలుగు , కన్నడ , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించి ప్రేక్షకులను అలరించారు. సింగర్ గా బప్పి లహరి పలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో ప్రేక్షకుల ను వీనుల విందు చేశారు. బప్పి లహరి అనారోగ్యం తో కన్ను మూయడం తో ప్రముఖ గాయకుడు , సంగీత దర్శకుడిని కోల్పోయి భారతీయ చలన చిత్ర పరిశ్రమ విషాదం లో మునిగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బప్పి లహరి (69 ) నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కానీ మంగళవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ముంబైలోని జుహూలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి బప్పి లహరి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: