ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ’96’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈసినిమాలో విజయ్ సేతుపతి, త్రిష తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అవార్డులను సొంతం చేసుకుంది ఈసినిమా. జాను పాత్రలో చేసిన ఒక్క త్రిషకే 11 అవార్డులను తెచ్చిపెట్టింది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా 2018లో వచ్చిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అహా లో ఈసినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా తెలియచేసింది. ఫిబ్రవరి 18న ఈ క్లాసిక్ సినిమా అహా లో రిలీజ్ అవుతుంది అంటూ తెలియచేశారు.
Ee special week ni marintha special ga cheyadaniki we are here with #96OnAHA.
This timeless classic premieres Feb 18!@VijaySethuOffl @trishtrashers #PremKumar #govindvasantha @Gourayy @VarshaBollamma @AadhityaBaaskar pic.twitter.com/B21am9byC7— ahavideoIN (@ahavideoIN) February 14, 2022
ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈరీమేక్ లో టాలెంటెడ్ నటుడు శర్వానంద్, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించారు. తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగు రీమేక్ కు కూడా దర్శకత్వం వహించారు. `దిల్` రాజు ఈసినిమాను నిర్మించారు. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఈసినిమా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: