సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హే సినామిక’.. ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

Dulquers Hey Sinamika Censor Formalities Completed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Hey Sinamika,Hey Sinamika Movie,Hey Sinamika Upcoming Movie,Hey Sinamika latest Updates,Hey Sinamika Upcoming Movie in 2022,Hey Sinamika Completes Censor part, Hey Sinamika U Certificate,Hey Sinamika Completed Censor,Hey Sinamika Fix the date for Trailer Release,Hey Sinamika Trailer on 16th Feb at 6Pm,Actress Kajal Agrawal, Kajal Aggarwal in Hey Sinamika Movie,Kajal Aggarwal Upcoming Movie Hey Sinamika,#kajalAggarwal,#Heysinamika

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ఈ సినిమా మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బృందం ఈసినిమాకు. అంతేకాదు తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు అంటే ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించారు. ఇంకా ఈ సినిమాలో కె.భాగ్యరాజా, సుహాసిని, ఖుష్బూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ , వయాకామ్ 18 స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ మరియు మలయాళంలో కూడా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 12 =