ఇటీవలే భారతరత్న, గాన కోకిల గా పేరు గాంచిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ను కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి ని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స తీసుకుంటున్న బప్పి లహిరి నిన్న రాత్రి మరణించారు. ఇక బప్పి లహరి మృతిపై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా బాలకృష్ణ బప్పి లహరి మరణంపై స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేశారు. సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహరి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. నేను నటించిన ‘రౌడి ఇన్స్ పెక్టర్’, ‘నిప్పురవ్వ’ వంటి చిత్రాలకు బప్పి లహరి సంగీతం అందించారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ తన సంతాపాన్ని తెలియచేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా బప్పి లహరి మరణంపై స్పందిస్తూ సంతాపం తెలియచేశారు. “బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. అతను నా సినిమాలకు చార్ట్‌బస్టర్ పాటలను అందించారు. ఇది నా చిత్రాల ప్రజాదరణకు ఎంతో దోహదపడింది. బప్పి లహరి సంగీతంలో ప్రతిబింబించే అతని ప్రత్యేకమైన శైలి, జీవితం పట్ల అతని ఉత్సాహం. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులు మరియు ప్రియమైన వారందరికీ నా హృదయపూర్వక సానుభూతి” అని ట్విట్టర్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
Rest in Peace Bappi da! #BappiLahiri pic.twitter.com/67QT9U7lgv
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2022
ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా బప్పి లహరి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, బిగ్ బాస్ ఇలా పలు సినిమాలకు పాటలు అందించగా దాదాపు అన్నీ పాటలు సూపర్ హిట్అయ్యాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: