
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 190


సూర్యతో పక్కా వర్క్ చేస్తా..!

ప్రభాస్ గొప్ప స్టార్ - భాగ్యశ్రీ

సాయి తేజ్ బ్యాక్ టు వర్క్

"భీమ్లా నాయక్"మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్

సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి

అనుపమ "బటర్ ఫ్లై "మూవీ టీజర్ రిలీజ్

'హనుమాన్'.. 'అంజమ్మ' గా క్రాక్ విలన్..!

హీరో ప్రభాస్ పై పూజాహెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

'బాహుబలి 3' పై ప్రభాస్ కామెంట్స్

"ఎవరికీ తలవంచడు "(ET) ప్రీ రిలీజ్ ఈవెంట్

"పొన్నియిన్ సెల్వన్" పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్

"గని "మూవీ కొత్త రిలీజ్ డేట్

వాయిదా పడ్డ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’

'నాగరత్తమ్మ' తో ఎఫ్ 3 టీమ్ సందడి..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

సూర్యతో పక్కా వర్క్ చేస్తా..!
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆకాశం నీ హద్దురా..!, జై భీమ్ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ మాస్ మసాలా చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య ఈటీ సినిమా చేస్తున్నాడు.మార్చి 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తెలుగు లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు 'కిరీటి' ఎంట్రీ.. ముఖ్య అతిథిగా రాజమౌళి..!
రాధా కృష్ణ దర్శకత్వంలో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ లో అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈసినిమా నిర్మితమవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జెనీలియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగు తో పాటు కన్నడ లో కూాడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్రవారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కర్ణాటక రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు…

ప్రభాస్ గొప్ప స్టార్ - భాగ్యశ్రీ
బ్లాక్ బస్టర్ "మైనే ప్యార్ కియా" హిందీ మూవీ తో భాగ్యశ్రీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి స్టార్ డమ్ పొందారు. ఆ తరవాత పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఇటీవల "తలైవి" తమిళ మూవీ లో నటించిన భాగ్యశ్రీ.. ఇప్పుడు "రాధే శ్యామ్" మూవీ లో హీరో ప్రభాస్ తల్లి పాత్రలో నటించారు. "రాధేశ్యామ్" మూవీ ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

సాయి తేజ్ బ్యాక్ టు వర్క్
సూపర్ హిట్ "పిల్లా నువ్వు లేని జీవితం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి తేజ్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. లవ్ .. మాస్ యాక్షన్ .. కామెడీ ప్రధానమైన కథలకు స్పెషలిస్ట్ గా మారిన సాయితేజ్ కరోనా ప్రభావం వలన .. ఆ తరువాత రోడ్డు ప్రమాదానికి గురికావడం వలన సినిమాలకు దూరం అయ్యారు.ఇప్పుడు సినిమాలకు సిద్ధం అయ్యారు.

"రాధేశ్యామ్ "మూవీ ప్రమోషన్స్ కై చెన్నై లో ప్రభాస్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్…

"భీమ్లా నాయక్"మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అనుపమ "బటర్ ఫ్లై "మూవీ టీజర్ రిలీజ్
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో “బటర్ ఫ్లై” థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్విజ్ గిడియన్ కట్టా సంగీతం అందిస్తున్నారు. అనుపమ పుట్టిన రోజు సందర్భంగా “బటర్ ఫ్లై”ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చేతులు కట్టకుని అనుపమ కనిపిస్తుండగా, వెనకాల సప్తవర్ణాల బటర్ ఫ్లై రెక్కలు విప్పుకుని కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

'హనుమాన్'.. 'అంజమ్మ' గా క్రాక్ విలన్..!
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక ఆతరువాత నరేష్ నాంది మూవీలో కూడా లాయర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించింది.ప్రస్తుతం గోపీచంద్, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే సినిమా లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఇప్పుడు వరలక్ష్మి ఖాతాలోకి వచ్చి చేరింది.

హీరో ప్రభాస్ పై పూజాహెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'బాహుబలి 3' పై ప్రభాస్ కామెంట్స్
ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని పాత్రలు చేసినా హిట్లు కొట్టినా ప్రభాస్ అంటే మాత్రం వెంటనే గుర్తొచ్చేది బాహుబలి. ప్రభాస్ అని పిలవడం కంటే బాహుబలి అని పిలిచేవారే ఎక్కువ. అంతలా పేరు తెచ్చిపెట్టింది బాహుబలి సినిమా ప్రభాస్ కు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 అండ్ 2 తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దాదాపు రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు, ఎన్నో అవార్డులు దక్కాయి ఈసినిమాకు.

"ఎవరికీ తలవంచడు "(ET) ప్రీ రిలీజ్ ఈవెంట్
స్టార్ హీరో సూర్య కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సూర్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా!”, “జైభీమ్” ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య ఇప్పుడు”ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్) మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్)తమిళ మూవీ , తెలుగు వెర్షన్ "ఎవరికీ తలవంచడు " మార్చి 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. డి ఇమాన్ సంగీతం…

కమల్ విక్రమ్ షూటింగ్ పూర్తి.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన..!
ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కమల్ కనిపించనున్నారు. ఈసినిమా కూడా ఎప్పటినుండో సెట్స్ పైనే ఉంది. ఇక ఎన్నో బ్రేక్ లు.. ఎన్నో అడ్డంకులు తరువాత ఈసినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ మరీ తెలియచేసింది. ఫహద్ ఫాజిల్ గన్ పేల్చే వీడియోను విడుదల చేసిన మేకర్స్ షూటింగ్ పూర్తయిందని తెలుపుతూ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అప్ డేట్ ఇచ్చారు. మార్చి14న విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది.

'భీమ్లానాయక్' విషయంలో హర్ట్ అవుతున్నా..సంయుక్త మీనన్ కౌంటర్..!
భీమ్లానాయక్ విషయంలో హర్ట్ అవుతున్నా అంటుంది ఆసినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్. ఇంతకీ ఏం విషయంలో సంయుక్త మీనన్ హర్ట్ అవుతుంది.. ఆ కథ ఏంటి అన్న సంగతి తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం అయితే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మూడు నాలుగు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరిదంటే ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే రెండు మూడుసార్లు సినిమాను చూసేస్తున్నారు.

"పొన్నియిన్ సెల్వన్" పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్
లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా అదే పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ మూవీ లో చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాళ , శరత్ కుమార్ , పార్తీబన్ , ప్రభు , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్" మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మెటావర్స్ లో 'రాధేశ్యామ్' ట్రైలర్.. సినీ చరిత్రలో మొదటిసారి..!
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. 1960 నాటి కాలంలో ఇటలీ నేపథ్యంలో వింటేజ్ ప్రేమకథ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యామ్ సినిమా.. ఎట్టకేలకు మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ విజువల్ వండర్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షిప్ ఎపిసోడ్ ట్రైలర్ లో ప్రత్యేకంగా…

ఒక్క సాంగ్ మినహా "రంగ రంగ వైభవంగా" షూటింగ్ పూర్తి
బ్లాక్ బస్టర్ "ఉప్పెన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజా వైష్ణవ్ తేజ్ "కొండపొలం" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా "రంగ రంగ వైభవంగా" మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

"గని "మూవీ కొత్త రిలీజ్ డేట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

వాయిదా పడ్డ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’
విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక టీజర్ ను బట్టి కథాంశం ఏంటో అర్థమైపోయింది. ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.