భీమ్లానాయక్ విషయంలో హర్ట్ అవుతున్నా అంటుంది ఆసినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్. ఇంతకీ ఏం విషయంలో సంయుక్త మీనన్ హర్ట్ అవుతుంది.. ఆ కథ ఏంటి అన్న సంగతి తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం అయితే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మూడు నాలుగు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరిదంటే ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే రెండు మూడుసార్లు సినిమాను చూసేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఈసినిమాపై ఇప్పుడు పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన హిట్ సాంగ్ తో పాటు, కొన్ని సీన్స్ సినిమాలో లేవని నిత్యామీనన్ పెదవి విరిచినట్టు వార్తలు వస్తున్నాయి. నిత్యామీనన్ మాత్రమే కాదు.. సంయుక్త కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రూమర్స్ పై సంయుక్త మీనన్ స్పందిస్తూ కాస్త వెటకారంగానే అందరికీ సమాధానం ఇచ్చింది. నేను చాలా హర్ట్ అయ్యాననే మాట వాస్తవమే. అయితే నా పాత్ర గురించి కాదు .. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి థియేటర్లో చూద్దామనుకుంటే ఇంతవరకూ టిక్కెట్ దొరకలేదు .. అందుకు అంటూ కౌంటర్ ఇచ్చింది. మరి ఈ రూమర్స్ కు ఇప్పటికైనా బ్రేక్ పడుతుందేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: