“ఎవరికీ తలవంచడు “(ET) ప్రీ రిలీజ్ ఈవెంట్

Suriya’s ET Movie Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, ET Movie,ET Movie Updates,ET Movie Upcoming Movie,ET Movie Latest Updates,Suriyas ET Movie Updates,Hero Suriya ET Movie Latest News,ET Movie Pre Release Event Updates, Evariki Thalavanchadu movie Updates,Evariki Thalavanchadu Movie Pre Release Event,Suriya Upcoming Movies,Suriya Latest Movie Updates,Suriya New Movie, ET Movie On March 10th,ET Movie Release Date on March 10th,Priyanka Mohan with Suriya New Movie ET,Priyanka Mohan in ET Movie,Actress Priyanka Mohan with Suriya Upcoming Movie ET, Priyanka Mohan upcoming Movies,Priyanka Mohan latst Movies,Priyanka Mohan Movie Updates,Pandiraj Director,Pandiraj Movies,Pandiraj Directed Movies, Pandiraj Movie ET,Pandiraj Upcoming Movie ET,Pandiraj With Hero Suriya Movie ET,Sun pictures Productions,Sun pictures Productions Banner ET Movie, Rana Daggubati About Suriya,Rana Daggubati About ET Movie,Rana Daggubati In PRe Release Event of ET,#suriya,#EvarikiThalavanchadu,#ET

స్టార్ హీరో సూర్య కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సూర్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా!”, “జైభీమ్” ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య ఇప్పుడు”ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్) మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్)తమిళ మూవీ , తెలుగు వెర్షన్ “ఎవరికీ తలవంచడు ” మార్చి 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. డి ఇమాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నారాయణ్‌దాస్‌ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్‌’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఎవరికీ తలవంచడు “(ET) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్‌ మలినేని అతిథులుగా పాల్గొన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ .. “ఆకాశం నీ హద్దురా”, “జై భీమ్‌” సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారనీ , మంచి సినిమాకు హద్దు లేదని నిరూపించారనీ , ఆ రెండు చిత్రాల్లా ‘ఈటీ’ కూడా స్పెషల్‌ ఫిల్మేననీ , ఇకతన అగరం ఫౌండేషన్‌కు స్ఫూర్తి చిరంజీవిగారనీ , ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరనీ , మనసు ఏం చెప్పిందో దాన్నే ధైర్యంగా చేయండనీ , కంఫర్ట్‌ జోన్‌లో ఉంటే ఎదుగుదల ఉండదనీ , కరోనా టైమ్‌లో ‘అఖండ’, ‘పుష్ప’, ‘బంగార్రాజు’, ‘భీమ్లా నాయక్‌’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్‌ చేశారనీ, మిగతా ఇండస్ట్రీలకు సినిమాలను విడుదల చేయాలనే ఆత్మవిశ్వాసం టాలీవుడ్‌ వల్లే కలిగిందనీ చెప్పారు.

రానా మాట్లాడుతూ..తాను నటించిన ఒక సినిమా చూసి , నీది యాక్టింగ్‌ కాదురా. అని సూర్య క్లాస్ పీకారనీ , ఆ క్లాసే తనను భల్లాలదేవుడు , డేనియల్‌ శేఖర్‌ని చేసిందనీ , “ఈటీ” చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు. ఈ సినిమా విజయం సాధించాలని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ప్రతి కథను డిఫరెంట్‌గా సెలెక్ట్‌ చేసుకునే ఇండియన్‌ హీరోల్లో సూర్య ఒకరనీ , ఆయన ఏ సినిమా చేసినా అందులో ఓ కొత్తదనం ఉంటుందనీ , “ఈటీ” సినిమా పెద్ద విజయం సాధిస్తుందనీ నిర్మాత ‘దిల్‌’ రాజు చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 17 =