రాధా కృష్ణ దర్శకత్వంలో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ లో అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈసినిమా నిర్మితమవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జెనీలియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగు తో పాటు కన్నడ లో కూాడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్రవారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కర్ణాటక రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ కొట్టగా, కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘కిరీటీని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రామిసింగ్‌గా కిరీటీ లుక్స్ వున్నాయి. నటుడికి కావాల్సిన నటన, నృత్యం, ఫైట్స్ తను చేయగలడు. వారాహి చలనచిత్రం బ్యానర్‌లో ఆయనను చూడటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక సిబ్బంది అయిన సెంథిల్ కుమార్, రవీందర్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ విభాగాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో రవి సర్, జెనీలియా, శ్రీలీల వంటి అద్భుతమైన తారాగణం కూడా ఉంది. రవి సార్ కిరీటికి మంచి గైడెన్స్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
జెనీలియా మాట్లాడుతూ ”నేను నటనకు దూరమై 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాతో మళ్లీ ముందుకు వచ్చాను. ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. తొలిసారిగా నటిస్తున్న కిరీటికి గుడ్‌లక్. ఈ చిత్రాన్ని భారీ నిర్మాతతో పాటు అద్భుతమైన నటీనటులు ఉన్నారు. మళ్ళీ గేప్ తీసుకున్నా ఈ చిత్ర యువ టీమ్‌లో న్యూ కమర్‌గా నేను జాయిన్ అయినట్లుగా ఫీలవుతున్నాను అన్నారు.
హీరో కిరీటి మాట్లాడుతూ – ”నేను సినిమాల్లోకి రావడానికి అప్పు సర్ స్ఫూర్తి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కొర్రపాటికి ధన్యవాదాలు. మేము కుటుంబ స్నేహితులం. వారు ఈ ప్రాజెక్ట్‌ను బాగా చూసుకుంటున్నాడు. అప్పు సర్ కి దొరికిన వ్యక్తి రాధా కృష్ణ. గొప్ప అరంగేట్రం అప్పు సార్‌కు ఇచ్చారు. మా సినిమాతో జెనీలియా మళ్లీ వచ్చినందుకు చాలా ఎగ్జైట్‌గా, ఎమోషనల్‌గా ఉంది. రవి సర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. శ్రీలీల నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను ఆమెతో కలిసి నటించడానికి ఎదురు చూస్తున్నాను. అద్భుతమైన సాంకేతిక నిపుణులతో పని చేయడం నా అదృష్టం – సెంథిల్ కుమార్ సర్, రవీందర్ సర్, పుష్ప కోసం తన సంగీతంతో భారతదేశాన్ని షేక్ చేసిన DSP సర్‌తో కూడా పని చేయడం నా అదృష్టం. పీటర్ హెయిన్‌తో కలిసి పనిచేయడం నాకు కూడా చాలా ఇష్టం. సినిమాలో కిక్‌కి తగ్గ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. నేను కష్టపడి పని చేస్తానని, నా ఉత్తమమైన పెర్‌ఫార్మెన్స్ అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అన్నారు.
కాగా సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, బాహుబలి లెన్స్‌మెన్ కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్, భారతదేశపు టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫ్ చేస్తారు.
Introducing @KireetiOfficial, Check out the glimpse here: https://t.co/9Pu1JeaZpH
𝐒𝐡𝐨𝐨𝐭 𝐁𝐞𝐠𝐢𝐧𝐬, A power-packed entertainer is coming your way…#RadhaKrishna @ThisIsDSP @DOPSenthilKumar@PeterHeinOffl #Raveendar @SaiKorrapati_ @VaaraahiCC pic.twitter.com/aq6IepRnlu
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) March 4, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: