ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని పాత్రలు చేసినా హిట్లు కొట్టినా ప్రభాస్ అంటే మాత్రం వెంటనే గుర్తొచ్చేది బాహుబలి. ప్రభాస్ అని పిలవడం కంటే బాహుబలి అని పిలిచేవారే ఎక్కువ. అంతలా పేరు తెచ్చిపెట్టింది బాహుబలి సినిమా ప్రభాస్ కు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1 అండ్ 2 తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో బాహుబలికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. దాదాపు రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు, ఎన్నో అవార్డులు దక్కాయి ఈసినిమాకు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాహుబలి 1, బాహుబలి 2 వచ్చేశాయి కాబట్టి అందరి ఇంట్రెస్ట్ బాహుబలి 3 పైనే. అందుకే రాజమౌళి కానీ ప్రభాస్ కానీ ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. తాజాగా మరోసారి ప్రభాస్ కు బాహుబలి 3 గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఇక తాజాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ను బాహుబలి 3 ఉంటుందా అన్న ప్రశ్న ను అడుగగా దానిని ప్రభాస్.. నేను, రాజమౌళి ఎప్పుడు కలిసినా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం..ఫ్యూచర్ లో ఏదైనా జరగొచ్చు.. ఇప్పుడే చెప్పలేం అంటూ సమాధానమిచ్చాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నదానిపై క్లారిటీ వచ్చింది కానీ.. అది బాహుబలి 3 అవుతుందా లేదా వేరే ఏదైనా అవుతుందా అన్నది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే..
కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న వింటేజ్ ప్రేమకథ రాధేశ్యామ్. ఈసినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: