తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆకాశం నీ హద్దురా..!, జై భీమ్ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ మాస్ మసాలా చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య ఈటీ సినిమా చేస్తున్నాడు.మార్చి 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తెలుగు లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైద్రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బోయపాటి శ్రీను ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సూర్యను తమిళ హీరోగా కాకుండా తమలో ఒకరిగా చూస్తున్నారని బోయపాటి అన్నారు. “సూర్య, నేనూ ఓ సినిమా తప్పకుండా చేస్తాము. నేను ఎప్పుడు అనేది చెప్పలేను కానీ మేము ఖచ్చితంగా ఓ సినిమా చేస్తాము” అని అన్నారు.
కాగా ఈసినిమాలో డాక్టర్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: