బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజా వైష్ణవ్ తేజ్ “కొండపొలం” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా “రంగ రంగ వైభవంగా” మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్, టైటిల్‌కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మూవీ నుండి రిలీజ్ అయిన తెలుసా తెలుసా సాంగ్ ప్రేక్షకులను అలరించింది. “రంగ రంగ వైభవంగా” మూవీ ఒక్క సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ బుధవారంతో కంప్లీట్ అయినట్టు దర్శకుడు గిరీశాయ తెలిపారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కానున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: