ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కమల్ కనిపించనున్నారు. ఈసినిమా కూడా ఎప్పటినుండో సెట్స్ పైనే ఉంది. ఇక ఎన్నో బ్రేక్ లు.. ఎన్నో అడ్డంకులు తరువాత ఈసినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ మరీ తెలియచేసింది. ఫహద్ ఫాజిల్ గన్ పేల్చే వీడియోను విడుదల చేసిన మేకర్స్ షూటింగ్ పూర్తయిందని తెలుపుతూ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అప్ డేట్ ఇచ్చారు. మార్చి14న విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
After 110 days of shoot it’s a WRAP 🔥
Thanx to the entire cast and crew for the EXTRAORDINARY effort! 🙏🏻@ikamalhaasan @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial #VIKRAM pic.twitter.com/5xwiFTHaZH— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 1, 2022
ఇంకా ఈసినిమాలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్, కాళిదాస్ జయరామ్, పలువురు ప్రముఖ నటీనటులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: