
సూపర్ హిట్ "పిల్లా నువ్వు లేని జీవితం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి తేజ్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. లవ్ .. మాస్ యాక్షన్ .. కామెడీ ప్రధానమైన కథలకు స్పెషలిస్ట్ గా మారిన సాయితేజ్ కరోనా ప్రభావం వలన .. ఆ తరువాత రోడ్డు ప్రమాదానికి గురికావడం వలన సినిమాలకు దూరం అయ్యారు.ఇప్పుడు సినిమాలకు సిద్ధం అయ్యారు.
సుకుమార్ రైటింగ్స్ , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ పై కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ మూవీ కి సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నట్టు , ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగు జరగనున్నట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కనున్న ఒక తమిళ రీమేక్ లో కూడా సాయి తేజ్ నటించనున్నారని సమాచారం. టాలీవుడ్ లో సాయి తేజ్ బిజీ అయ్యే అవకాశం ఉంది.







