తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక ఆతరువాత నరేష్ నాంది మూవీలో కూడా లాయర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించింది.ప్రస్తుతం గోపీచంద్, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే సినిమా లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఇప్పుడు వరలక్ష్మి ఖాతాలోకి వచ్చి చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త జోనర్ తో వస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలోనే వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈమేరకు చిత్రయూనిట్ నేడు తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అంజమ్మ అనే పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా.. పోస్టర్ లో లుక్ ను బట్టి మరోసారి పవర్ ఫుల్ రోల్ తో రాబోతుందని అర్థమవుతుంది.
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: