విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక టీజర్ ను బట్టి కథాంశం ఏంటో అర్థమైపోయింది. ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను మార్చి 4న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4న పెళ్లి ముహుర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాం అంటూ కామెడీ చెబుతూ రిలీజ్ వాయిదా వేశారు.
కాగా రుక్సార్ దిల్లాన్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా పవి కె.పవన్ పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: