మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Bell rings for the Final Round on April 8th.
Coming to theatres near you. #ghani #ghanifromapril8th pic.twitter.com/SoY1krBOMY
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 2, 2022
“గని “మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫైనల్ గా హీరో వరుణ్ తేజ్ ఏప్రిల్ 8 వ తేదీ “గని “మూవీ రిలీజ్ కానున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీ ఫైనల్ రౌండ్ కై బెల్ మ్రోగుతుందంటూ వరుణ్ ట్వీట్ చేసి ఒక వీడియో క్లిప్ ను షేర్ చేశారు. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: