అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి ‘ఎఫ్3’ సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు ఎఫ్ 3 టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. దీనిలోభాగంగానే నాగరత్తమ్మ అంటూ సునయన తో ఎఫ్ 3 టీమ్ సందడి చేస్తుంది. మొదట అనిల్ రావిపూడిని పలకరించి.. ఆ తర్వాత బిల్డింగ్ పై ఉన్న వరుణ్, వెంకీ తో సందడి చేసింది సునయన. ఎఫ్ 2లో లాగా ఫ్రస్టేషన్ తగ్గించుకోవడానికి ఎఫ్ 3లో ఎలాంటి సీన్లు ఉండబోతున్నాయని ఇద్దరినీ అడుగుతుంది నాగరత్తమ్మ. సెట్స్ లో శ్రీనివాస్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, ప్రగతి, రాజేంద్రప్రసాద్ లాంటి నటీనటులతో ఫన్నీ సంభాషణ జరిపింది. రత్తమ్మ ఎఫ్ 3 సెట్స్ లో సందడి చేసిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
రత్తమ్మక్క తో మామూలుగా ఉండదు 😈
A Special Video of F2 Franchise Fan-u & Family Audien-u🥳
▶️ https://t.co/u2Emn04d7q#F3Movie 🤟tho Ee Summer ki Solid ga Vastham🤝🏻😎#F3OnMay27 @VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/rgB06DH1Jm
— Sri Venkateswara Creations (@SVC_official) March 4, 2022
కాగా ఈసినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, రఘుబాబు, తులసి తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: