
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 19


ఆసక్తికరంగా మారిన వాల్తేరు వీరయ్య రిలీజ్

ఆశిష్ 'సెల్ఫిష్' షూటింగ్ ప్రారంభం

19 సంవత్సరాల క్రితమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్

HIT 3 మూవీ లో అర్జున్ సర్కార్ గా హీరో నాని

తునివు-ప్రముఖ సంస్థకు తెలుగు హక్కులు

దుబాయ్ లో #SSMB 28 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

సాయి తేజ్ కోసం ఎన్టీఆర్

మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తాత లో కీర్తి సురేష్
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన HIT 2
దర్శకుడు బాలా సినిమాకి హీరో సూర్య గుడ్ బై
రిలీజ్ అయిన రజనీకాంత్ బాబా మూవీ రీ రిలీజ్ ట్రైలర్

పవన్-సుజీత్ కాంబోపై చరణ్ రియాక్షన్

యూవీ క్రియేషన్స్ లో నయనతార కనెక్ట్

50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార తెలుగు వెర్షన్

ఘనంగా జరిగిన హన్సిక వివాహం

25 రోజులు పూర్తి చేసుకున్న యశోద
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి, హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటనతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. యశోద మూవీలో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

50 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న హనుమాన్ మూవీ టీజర్
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సూపర్ హీరో మూవీ హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హనుమాన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ మూవీ కి అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆసక్తికరంగా మారిన వాల్తేరు వీరయ్య రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా అందులో గాడ్ ఫాదర్ మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం.

ఆశిష్ 'సెల్ఫిష్' షూటింగ్ ప్రారంభం
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు ఆశిష్ రెడ్డి. తన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఇక ఈసినిమాను ఎప్పుడో లాంచ్ చేసారు కానీ ఇంతవరకూ షూటింగ్ ను మొదలుపెట్టలేదు. ఇప్పటికే ఈసినిమా నుండి స్లీవ్‌లెస్ బ్లాక్ షర్ట్‌లో…

19 సంవత్సరాల క్రితమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

HIT 3 మూవీ లో అర్జున్ సర్కార్ గా హీరో నాని
HIT మూవీ సిరీస్ లో 7 పార్ట్ లు నిర్మించనున్నట్టు హీరో నాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన HIT :ది ఫస్ట్ కేస్ మూవీ ఘనవిజయం సాధించింది. సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో 2వ పార్ట్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తున్న HIT…

తునివు-ప్రముఖ సంస్థకు తెలుగు హక్కులు
తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం సినిమా హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకంటూ వెళిపోతున్నాడు. అంతేకాదు అజిత్ కు ఒక డైరెక్టర్ తో వర్క్ సెట్ అయితే అతనితో ఎన్నిసార్లు వర్క్ చేయడానికి అయినా రెడీ అయిపోతాడన్న విషయం తెలిసిందే కదా. ఆ విధంగానే గతంలో తమిళ్ దర్శకుడు శివ దర్శకత్వంలో అజిత్ ఏకంగా నాలుగు సినిమాలు తీశాడు. నాలుగు కూడా హిట్టయ్యాయి. ఇక ఇప్పుడు మరో దర్శకుడితో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు హెచ్. వినోద్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. నెర్కొండ పార్వాయి సినిమా ఇంకోటి వాలిమై సినిమా. నెర్కొండ పార్వాయి సినిమా పింక్…

దుబాయ్ లో #SSMB 28 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

18 పేజెస్ టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్
ఈ ఏడాది కార్తికేయ2 సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇటీవల 'నన్నయ్య రాసిన' అనే పాటను విడుదల చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు. టైమ్ ఇవ్వు పిల్లా అనే రెండో పాటను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈపాటను తమిళ్ స్టార్ హీరో…

సాయి తేజ్ కోసం ఎన్టీఆర్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సింది కానీ సాయి తేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరగడంతో ఈసినిమా షూటింగ్ కు చాలా కాలం గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్లు అయితే ఇంతవరకూ రాలేదు. సాయి తేజ్ పుట్టిన రోజున మాత్రం తేజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ అయితే ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈసందర్భంగా మరో సర్…

బెదురులంక 2012 నేహా శెట్టి లుక్ రిలీజ్
క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. బెదురులంక 2012 అనే టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఓ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి నేహాశెట్టి లుక్ ను రిలీజ్ చేశారు. నేడు నేహా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా తన లుక్ ను రిలీజ్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. లేటెస్ట్‌గా రిలీజైన పోస్టర్‌లో నేహా…

టైగర్ నాగేశ్వర రావు సెట్స్ లో రేణు దేశాయ్ బర్త్ డే వేడుకలు
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తాత లో కీర్తి సురేష్
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన HIT 2
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
దర్శకుడు బాలా సినిమాకి హీరో సూర్య గుడ్ బై
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ ను సూర్య నిర్మించారు. హీరో సూర్య ప్రస్తుతం వనంగాన్, సూర్య 42 మూవీస్ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ నందా, పితామగన్ మూవీస్ తరువాత దర్శకుడు బాలా, హీరో సూర్య కాంబినేషన్ లో వనంగాన్ తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ 2D ఎంటర్ టైన్ మెంట్స్ పై హీరో సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా నుంచి సూర్య వైదొలగడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రిలీజ్ అయిన రజనీకాంత్ బాబా మూవీ రీ రిలీజ్ ట్రైలర్
లోటస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సూపర్ నేచురల్ యాక్షన్ ఫిల్మ్ బాబా 2002 ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యింది. మనీష కొయిరాలా కథానాయిక . ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రజనీ కాంత్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. కొంతకాలంగా సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగు తున్న విషయం తెలిసిందే. బడా హీరోల బర్త్ డే సందర్భంగా 4K పేరుతో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా బాబా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 12న రజనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బాబా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా…

పవన్-సుజీత్ కాంబోపై చరణ్ రియాక్షన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఒకపక్క పూర్తి చేయాల్సిన సినిమాలు ఉండగానే మరోపక్క కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఇక ఈసినిమా తరువాత హరీష్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాల్సిఉంది. ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియని పరిస్థితి. ఈనేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి అందరికీ షాకిచ్చింది. సాహో డైరెక్టర్ సుజీత్ తో పవన్ కళ్యాణ్ తరువాత సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి…

యూవీ క్రియేషన్స్ లో నయనతార కనెక్ట్
ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు తెలుగులో హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ముఖ్యంగా టాప్ ప్రొడ్యూసర్స్ అయిన అల్లు అరవింద్ ఇంకా దిల్ రాజు ఇప్పటికే పలు సినిమాలను ఇక్కడ రిలీజ్ చేస్తూ విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో నడుస్తుంది యూవీ క్రియేషన్స్. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. గతంలో నయన్ ప్రధాన పాత్రలో 'మాయ' అనే హారర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. తెలుగులో ఈసినిమా మయూరి అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్…

50 రోజులు పూర్తి చేసుకున్న కాంతార తెలుగు వెర్షన్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ పై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ఘనంగా జరిగిన హన్సిక వివాహం
ఇప్పుడు హీరోయిన్లు కూడా ఒకపక్క కెరీర్ ను లీడ్ చేస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వివాహ అనంతరం కూడా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో కాజల్, నయనతార దగ్గర నుండి చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వివాహబంధంలోకి అడుగుపెట్టేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు హన్నిక మోత్వాని. రీసెంట్ గానే హన్సిక తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన సంగతి తెలిసిందే కదా. వ్యాపారవేత్త సొహైల్ కతూరియా గత నెల హన్సికకు ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే సొహైల్ కతూరియాను పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పోస్ట్…