ఈ ఏడాది కార్తికేయ2 సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇటీవల ‘నన్నయ్య రాసిన’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు. టైమ్ ఇవ్వు పిల్లా అనే రెండో పాటను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈపాటను తమిళ్ స్టార్ హీరో శింబు పాడారు. శ్రీమణి ఈపాటను రాయగా.. శింబు ఆలపించారు. ఈ పాట రిలీజైన కొద్ది సేపటికే విశేషం గా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here it is! 💔
The Situation of many 😅 #TimeIvvuPilla song out now! 🕺 #18Pages ~ #LoveIsCrazy🎤 @SilambarasanTR_
🎹 @GopiSundarOffl
📝 @ShreeLyricist @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @lightsmith83 @adityamusic pic.twitter.com/7zlmFNxHqW— Nikhil Siddhartha (@actor_Nikhil) December 5, 2022
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: