మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా అందులో గాడ్ ఫాదర్ మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి రేసులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయి. దీంతో ఈసినిమాను సంక్రాంతి రేసులో ఏ రోజున రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం సోలో రిలీజ్ గానే ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. చూద్దాం మరి చిరు ఎప్పుడు బరిలోకి దిగుతారో..
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: