క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. బెదురులంక 2012 అనే టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఓ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి నేహాశెట్టి లుక్ ను రిలీజ్ చేశారు. నేడు నేహా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా తన లుక్ ను రిలీజ్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. లేటెస్ట్‌గా రిలీజైన పోస్టర్‌లో నేహా పల్లెటూరి అమ్మాయి చిత్రగా కనిపించనుంది. ఫస్ట్ లుక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨
Introducing “Chitra” from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS
— Kartikeya (@ActorKartikeya) December 5, 2022
కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: