శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి, హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటనతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. యశోద మూవీలో యశోద పాత్రలో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యశోద మూవీ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కు ఇంత కలెక్షన్స్ రావడం విశేషమే. యశోద మూవీ సక్సెస్ ఫుల్ గా 25 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా తమ మూవీని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకి మేకర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత ప్రస్తుతం ఖుషి మూవీ లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: