లోటస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సూపర్ నేచురల్ యాక్షన్ ఫిల్మ్ బాబా 2002 ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యింది. మనీష కొయిరాలా కథానాయిక . ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రజనీ కాంత్ ఈ సినిమాలో హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా వ్యవహరించారు. కొంతకాలంగా సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగు తున్న విషయం తెలిసిందే. బడా హీరోల బర్త్ డే సందర్భంగా 4K పేరుతో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా బాబా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 12న రజనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బాబా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాబా మూవీ రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకాదరణ పొందకపోయినా రజనీ డైలాగ్స్, పాటలను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ లింక్ ను రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన సినిమా త్వరలో రీ రిలీజ్ కాబోతుందని వెల్లడించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: