కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సింది కానీ సాయి తేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరగడంతో ఈసినిమా షూటింగ్ కు చాలా కాలం గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్లు అయితే ఇంతవరకూ రాలేదు. సాయి తేజ్ పుట్టిన రోజున మాత్రం తేజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ అయితే ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈసందర్భంగా మరో సర్ ప్రైజ్ ను కూడా ఇచ్చారు. ఈ గ్లింప్స్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ గ్లింప్స్‌పై అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank You @tarak9999 Garu for lending your Majestic Voice for the Title Glimpse of #SDT15 🤩💥#NTRforSDT for #SDT15TitleGlimpse On 7th Dec, 11AM.@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/FaAIltKOyi
— SVCC (@SVCCofficial) December 5, 2022
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.