
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 169


"కార్తికేయ 2 "మూవీ రిలీజ్ డేట్

అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

రక్షిత్ శెట్టి '777 ఛార్లి' రిలీజ్ డేట్ ఫిక్స్..!

1000 కోట్ల క్లబ్ లో "ఆర్ ఆర్ ఆర్ "

ఊటీ షెడ్యూల్ స్టార్ట్ చేసిన నాగార్జున 'ది ఘోస్ట్'

'హరి హర వీరమల్లు' పవన్ పవర్ ఫుల్ ప్రీ సెషన్స్..!

'ఆచార్య' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

రకుల్ ప్రీత్ స్టన్నింగ్ లుక్

రెండు ప్రాజెక్ట్స్ తో తేజ బాలీవుడ్ రీ ఎంట్రీ

దుల్కర్ సల్మాన్ మూవీ టైటిల్ "సీతారామం"
వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధం తో రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ లో మృణాళిని ఠాకూర్ సీత, రష్మిక అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని వెల్లడిస్తూ మేకర్స్ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

"కార్తికేయ 2 "మూవీ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై విభిన్న కథా చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ 2 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “కార్తికేయ 2 “మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

సినిమా ఎంజాయ్ చేయడం తెలుగు వాళ్లను చూసి నేర్చుకోవాలి..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. ఇక ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ వీలైనంత మేరకు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో ప్రమోషన్స్ కంప్లీట్ చేసిన యష్ నేడు తిరుపతిలో కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!
ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే హీరోలు ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ పాత్ర ఎంత డిఫరెంట్ గా ఉంది అన్నది మాత్రమే చూసుకుంటున్నారు. ఇక అల్లరి నరేష్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఒకప్పుడు కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చాలా కాలం సరైన హిట్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మహేష్ మహర్షి సినిమాలో మంచి రోల్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తరువాత నాంది లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో చేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో…

20 సంవత్సరాలుగా ఎన్టీఆర్ కు అభిమాని గా ప్రశాంత్ నీల్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.హీరో యష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.

"కళావతి" సాంగ్ కు సీనియర్ హీరోయిన్ లయ డ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “సర్కారు వారి పాట ” ఫస్ట్ సింగిల్ “కళావతి ” సాంగ్ ను చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన “కళావతి “మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

రక్షిత్ శెట్టి '777 ఛార్లి' రిలీజ్ డేట్ ఫిక్స్..!
పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు వేరే భాషల్లోకి డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ సినిమా ఎఫెక్ట్ తో ఇక కన్నడ సినిమాలు కూడా ఈమధ్య తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇప్పటికే కిరిక్ పార్టీ, 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు రక్షిత్ శెట్టి. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.

'వినరో భాగ్యము విష్ణుకథ' కిరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్
వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం. కేవలం వరుసగా సినిమాలు చేయడమే.. అది కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ లలోనే ఛాన్స్ లు దక్కించుకోవడం విశేషం. నిజానికి కిరణ్ ఇప్పటివరకూ చేసింది రెండు మూడు సినిమాలు మాత్రమే.. అవి కూడా మంచి బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమాలు కూడా కావు.. అయినా కూడా ఈ యంగ్ హీరోకు మాత్రం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం కిరణ్ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్…

శ్రీరామ నవమి సందర్భంగా "హరి హర వీరమల్లు" కొత్త పోస్టర్
బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్, పాన్ ఇండియా “హరి హర వీరమల్లు ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

1000 కోట్ల క్లబ్ లో "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభిస్తుంది.

ఊటీ షెడ్యూల్ స్టార్ట్ చేసిన నాగార్జున 'ది ఘోస్ట్'
కింగ్ నాగార్జున మాత్రం హడావుడి లేకుండా కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున. సోగ్గాడే చిన్న నాయన సినిమాకు వచ్చిన సీక్వెల్ ఇది. ఇక ఇప్పుడు ప్రస్తుతం నాగ్ తన కొత్త సినిమా ది ఘోస్ట్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు దుబాయ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఊటీలో నేడు కొత్త షెడ్యూల్ ను స్టార్ట్…

'హరి హర వీరమల్లు' పవన్ పవర్ ఫుల్ ప్రీ సెషన్స్..!
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ అయితే కొంతవరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ మధ్యలో కరోనా వల్ల.. ఇతర కారణాల వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా స్టార్ట్ అయిన తరువాతే పవన్ ఒక పక్క భీమ్లానాయక్ పూర్తి చేసి రిలీజ్ చేశాడు.. మరోపక్క క్రిష్ కూడా కొండపొలం సినిమా తీశాడు. ఫైనల్ గా చాలా గ్యాప్ తరువాత ఈసినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది.

'ఆచార్య' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు-చరణ్ ఇద్దరూ నటిస్తున్న సినిమా అవ్వడంతో వీరిద్దరిని సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గత ఏడాదే రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల లేట్ అయిపోయింది. ఇక ఫైనల్ గా ఈసినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ మళ్లీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

దక్షిణాది ఓటిటిలో టాప్ పెర్ఫామర్ గా "అఖండ"
హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

పూజా హెగ్డే 'అరబిక్ కుతు' డ్యాన్స్ వైరల్..!
ప్రస్తుతం దేశంలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఆ లిస్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే ముందు ఉంటుంది. ఇప్పటికే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే తెలుగుతో పాటు తమిళ్, అలానే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ తో దువ్వాథ జగన్నాథం సినిమాతో మొదట సక్సెస్ ను అందుకున్న పూజాహెగ్డే ఆ తరువాత పెద్దగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస హిట్లను అందుకుంటూ లక్కీ హీరోయిన్ అయింది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలో తను నటించిన ఆచార్య సినిమా అలానే బీస్ట్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నాయి.

రకుల్ ప్రీత్ స్టన్నింగ్ లుక్
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, అజయ్ దేవగన్ “రన్ వే 34”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

రెండు ప్రాజెక్ట్స్ తో తేజ బాలీవుడ్ రీ ఎంట్రీ
"రాత్ " మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ పలు సూపర్ హిట్ హిందీ , తెలుగు మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. సూపర్ హిట్ "చిత్రం "మూవీ తో తేజ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "ఏ దిల్ "మూవీ తో తేజ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు మూవీస్ కు దర్హకత్వం వహించిన తేజ ప్రస్తుతం అభిరామ్ దగ్గుబాటి హీరో గా తెరకెక్కుతున్న "అహింస " మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు.

" ది కశ్మీర్ ఫైల్స్" నిర్మాతకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషెస్
జీ స్టూడియోస్ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి , అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలలో 1990లలో జమ్మూకశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన "ది కశ్మీర్ ఫైల్స్" హిందీ మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సుమారు 350 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. " ది కశ్మీర్ ఫైల్స్" మూవీప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకుల ప్రశంసలు అందుకుంటుంది.

సీనియర్ నటుడు 'మన్నవ బాలయ్య' మృతికి బాలకృష్ణ సంతాపం
టాలీవుడ్ లో నేడు మరో విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య నేడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు హైద్రాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో కన్నుముశారు. ఇక బాలయ్య మరణానంతరం ఇండస్ట్రీ నుండి పలువురు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.

ముంబై సక్సెస్ పార్టీ ప్రెస్ మీట్ లో "ఆర్ ఆర్ ఆర్"టీమ్
దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ అన్ని భాషల లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హిందీలో ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత జయంతి లాల్ రిలీజ్ చేశారు. “ఆర్ఆర్ఆర్” ఊహించిన విధంగా సక్సెస్ కావడంతో జయంతిలాల్ సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్య ఇతర ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ హాజరయ్యారు.