సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “సర్కారు వారి పాట ” ఫస్ట్ సింగిల్ “కళావతి ” సాంగ్ ను చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన “కళావతి “మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కళావతి సాంగ్లో మహేష్ బాబు వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ సాంగ్ కు అభిమానులతో పాటు కీర్తి సురేష్ ,థమన్ ఎస్ , మహేష్ బాబు తనయ సితార వంటి సెలబ్రిటీస్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి వీడియోస్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కళావతి సాంగ్ కు సీనియర్ హీరోయిన్ లయ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, తన డాన్స్ కి సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. “స్వయంవరం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లయ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























