సినిమా ఎంజాయ్ చేయడం తెలుగు వాళ్లను చూసి నేర్చుకోవాలి..!

KGF Yash Super Words About Telugu Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash,Hero Yash,KGF Fame Yash,KGF Hero yash About Telugu Audience,KGF Chpater 2 Movie Updates,KGF Chapter 2,KGF Chpater Releasing on 14th April,Yash Super Words About Telugu Audience, yash say Telugu Audience Enjoy the Movie,KGF3 Will be the next,Beast vs. KGF2,KGF before KGF after,Yash Ready for a multistarrer like RRR,Yash About Telugu People

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. ఇక ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ వీలైనంత మేరకు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో ప్రమోషన్స్ కంప్లీట్ చేసిన యష్ నేడు తిరుపతిలో కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తిరుపతి పుణ్యక్షేత్రంకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.. దేవుని బ్లెస్సింగ్స్ మనకు కావాలి.. ఆంధ్ర, కర్ణాటక మధ్య ఉండే సంబంధం ఎప్పుడూ స్పెషలే.. కల్చర్ ఒకటే.. లాంగ్వేజ్, లిపి కూడా చాలా దగ్గరగా ఉంటుంది.. కన్నడ వాళ్లు తెలుగును చాలా ఈజీగా అర్ధంచేసుకోగలరు. మీరు నన్ను ఇంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు.. ఇప్పుడు కాదు కె.జి.యఫ్ ముందు కూడా తెలుగు ప్రేక్షకులు చాలా మంది నా సినిమాలను ఇష్టపడేవాళ్లు.. ముఖ్యంగా బోర్డర్ లో ఉండే ఫ్యాన్స్ ఎప్పుడూ చెబుతుండేవాళ్లు. మీరంతా ఇంత అభిమానంతో, ప్రేమతో నన్ను రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నాను.

తిరుపతి అంటేనే ప్రసాద్ గారు ఎప్పుడూ ఉంటారు. చాప్టర్ 1 సమయంలో కూడా ఆయన మాతో ఉన్నారు.. ఇప్పుడు చాప్టర్ 2 కి కూడా ఆయన నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను.

నిర్మాత సాయి గురించి మాట్లాడుతూ.. సాయి అన్నఈసినిమా స్టార్టింగ్ నుండి సినిమాను చాలా నమ్మారు.. మా మీద నమ్మకం ఉంచారు.. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు సాయి అన్నకు అలానే వారాహి ఫిలింస్ కు థ్యాంక్స్. సినిమాటోగ్రాఫర్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. నిజానికి ఇలాంటి ఫంక్షన్స్ కు టెక్నీషియన్స్ రారు. కానీ ఆయన ఈ కార్యక్రమానికి రావడం హ్యాపీ గా ఉంది.. ఆయన వర్క్ మీరు చూశారు. మీకు ఆయన వర్క్ నచ్చుతుందని అనుకుంటున్నాను.. ఇలానే మమ్మల్ని బ్లెస్ చేయండి.. ఆంధ్ర, తెలంగాణ తెలుగు ప్రేక్షకులకు అందరికి లవ్యూ. కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా మీరు ఇచ్చిన సపోర్ట్, కలెక్షన్స్ చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా బెస్ట్ ఆడియన్స్ అని చెప్పొచ్చు. సినిమా ఎలా చూసి ఎంజాయ్ చేయాలనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.

కె.జి.యఫ్ 3 ఉంటుందా?
ముందు సెకండ్ పార్ట్ చూసి ఎంజాయ్ చేయండి.. సినిమా రిలీజ్ తరువాత మళ్లీ వస్తా అప్పుడు మాట్లాడుకుందాం.. ఆడియన్స్ డిసైడ్ చేయాలి అదంతా..

బీస్ట్ వర్సెస్ కె.జి.యఫ్ 2..?
మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే జరుగుతుంది.. నేను దేవుని దర్శనానికి వచ్చాను.. పుణ్యక్షేత్రంలో ఉన్నాము.. అందరికీ మంచే జరగాలని కోరుకుందాం..

కె.జి.యఫ్ ముందు కె.జి.యఫ్ తరువాత..?
ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ప్రేక్షకులకు తరువాత వచ్చే సినిమాలపై ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము హార్డ్ వర్క్ చేస్తాము..అది మా బాధ్యత.. ఖచ్చితంగా ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడానికి హార్డ్ వర్క్ చేస్తాను..

ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీస్టారర్ కు రెడీనా..?
అలాంటి సినిమాలు తీయడానికి డైరెక్టర్ ఉండాలి.. మనకేం ఉంటుంది.. మనకు మంచి రోల్.. ఆడియన్స్ ను ఒక ఊరమాస్ సినిమా ఇవ్వాలి అని ఉంటుంది.. కానీ మల్టీస్టారర్ కు మంచి డైరెక్టర్ ఉండాలి..

మాస్ సినిమాలే చేస్తారా..?
మాస్ లోనే ఒక క్లాస్ ఉంటుంది. మాస్ అంటే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఒక డైలాగ్ అవ్వొచ్చు..ఒక బాడీ లాంగ్వేజ్, థాట్ ప్రాసెస్.. అంటే మిర్చీలా స్పైస్ ఉండాలి.. ఎప్పుడు సినిమా చేసినా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలి.. సెలబ్రేట్ చేసుకోవాలి.. నాకు అలాంటి సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం..

మదర్ సెంటిమెంట్..?
‘పార్ట్ 2లోనే మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. మదర్ సెంటిమెంటే ఇంపార్టెంట్. ఇది తల్లీకొడుకుల సినిమా. సినిమాలో అదే మెయిన్ ఎమోషన్.

బాహుబలి కలెక్షన్లను కె.జి.యఫ్ 2 బ్రేక్ చేస్తుందా ?
‘ఒక సినిమా రిలీజ్ అయితే అంతకుముందున్న రికార్డులను బ్రేక్ చేయాలి. దాన్ని ప్రోగ్రెస్ అంటారు. ఎదో ఒక రికార్డు క్రియేట్ అయ్యిందంటే దాన్నే పట్టుకుని కూర్చోవద్దు. కలెక్షన్లు, రికార్డులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అయితే ప్రేక్షకుల ప్రేమ ఎంత ఉంది? అనేదే చాలా ముఖ్యం. ఆ దేవుడు ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది. ఏది చేయాలన్నా.. ప్రేక్షకుల చేతిలోనే ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eighteen =