పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు వేరే భాషల్లోకి డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ సినిమా ఎఫెక్ట్ తో ఇక కన్నడ సినిమాలు కూడా ఈమధ్య తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇప్పటికే కిరిక్ పార్టీ, ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు రక్షిత్ శెట్టి. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదలచేయనున్నట్టు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది.
కాగా కిరణ్ రాజ్.కె దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఇబ్బందలు పడుతూ ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది. వారి మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది. చివరకు ఏం జరిగిందనే విషయాలను 777 ఛార్లి అనే అడ్వెంచరస్ కామెడీలో చూపించబోతున్నారు. రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూనే జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లో విడుదలవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: