హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.హీరో యష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో “సలార్” మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ “#ఎన్టీఆర్ 31 ” మూవీ ని తెరకెక్కించనున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఎన్టీఆర్ తో కలిసి జర్నీ చేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తుందనీ , రెండేళ్లుగా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందనీ , ఎన్టీఆర్ కు తన స్టోరీ బాగా నచ్చిందనీ ,ప్రస్తుతం దానిపై వర్క్ చేస్తున్నాననీ , ఇప్పటివరకు పది, పదిహేను సార్లు ఎన్టీఆర్ ని కలిశాననీ , అతడిని అర్ధం చేసుకోవాలనుకుంటున్నాననీ , తన సినిమాలకు సంబంధించి ఇలా ముందుగా హీరోలతో ట్రావెల్ చేస్తుంటాననీ , ఎన్టీఆర్ కి తను అభిమానిననీ , 20 ఏళ్లుగా అతడికి పెద్ద ఫ్యాన్ అనీ, ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ రావడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: